24 May, 2026 | 2:23 AM

ప్రాణం నిలిపిన మెడికవర్

24-05-2026 12:26 AM

హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యంత క్లిష్టమైన న్యూ రోవాస్కులర్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి, పునరావృత స్ట్రోక్స్‌తో బాధపడుతున్న కర్నూలుకు చెందిన 54 ఏళ్ల ఉసేన్ బాషాకు కొత్త జీవితం ప్రసాదించారు. అనేక ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వచ్చిన ఆయనకు వైద్యులు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి, అధునాతన వైద్యం అందించి, కాపాడారు. 

మెదడులో అత్యంత కీలకమైన రక్తనాళాల్లో ఒకటైన బాసిలర్ ఆర్టరీ దాదాపు పూర్తిగా మూసుకుపోవడంతో రోగి ప్రాణాపాయ స్థితి కి చేరుకున్నాడు. రోగి మాట్లాడలేకపోవడం, మింగలేకపోవడం, తీవ్రమైన తల తిరగడం, నడిచేటప్పుడు సమతుల్యత కోల్పోవడం, సహాయం లేకుండా నడవలేకపోవడం వంటి తీవ్రమైన న్యూరోలాజికల్ సమస్యలతో ఆసుపత్రికి వచ్చాడు. గత కొన్ని నెలలుగా నిరంతర మందుల చికిత్స పొందుతున్నప్పటికీ పలుమార్లు స్ట్రోక్‌కు గురయ్యాడు.

రోగికి హైబీపీ, టైప్-2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధు లు ఉండగా, గతంలో ్పుజుఔ సర్జరీ మరియు యాంజియోప్లాస్టీ కూడా చేయించుకున్నారు. మెడికవర్ హాస్పిటల్స్‌లో నిర్వహించిన అత్యాధునిక న్యూరోవాస్కులర్ స్కానింగ్, డయాగ్న స్టిక్ సెరెబ్రల్ యాంజియోగ్రఫీ (ఈఐజు) పరీక్షల్లో రోగి బాసిలర్ ఆర్టరీలో దాదాపు 99 శాతం బ్లాకేజ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ పరిస్థితి మెదడు కండర భాగానికి రక్తప్రసరణను తీవ్రంగా అడ్డుకోవడంతో పెద్ద స్థాయి బ్రెయిన్‌స్టెమ్ స్ట్రోక్, పక్షవాతం, కోమా, ఆకస్మిక మరణం వంటి ప్రమాదాలకు దారితీసే అవకాశముందని వైద్యులు తెలిపారు. 

పునరావృత స్ట్రోక్స్ కొనసాగుతున్న నేపథ్యంలో, మెడికవర్ న్యూరో సెన్సైస్ మల్టీడి సిప్లినరీ బృందం అత్యంత క్లిష్టమైన బాసిలర్ ఆర్టరీ స్టెంటింగ్ ప్రక్రియను చేపట్టింది. మార్చి 17, 2026న నిర్వహించిన ఈ సూపర్ స్పెషాలిటీ ఎండోవాస్కులర్ ప్రక్రియ ద్వారా బ్లాక్ అయిన రక్తనాళాన్ని విజయవంతంగా తెరిచి, మెదడుకు సాధారణ రక్తప్రసరణను పునరుద్ధరించారు.

ఈ క్లిష్టమైన ప్రక్రియకు కన్సల్టెంట్ స్ట్రోక్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అన్నపురెడ్డి జగదీష్ నాయకత్వం వహించగా, కన్సల్టెంట్ న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ కామేపల్లి హరి కిషోర్‌తో పాటు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, న్యూరో క్రిటికల్ కేర్, రీహాబిలిటేషన్ బృందాలు సమన్వయం తో సేవలందించాయి. చికిత్స అనంతరం రోగి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడగా, ఫిజియోథెరపీ, న్యూరో రీహాబిలిటేషన్ సహాయంతో తిరిగి కోలుకుని స్థిరమైన ఆరోగ్య పరిస్థితిలో డిశ్చార్జ్ అయ్యారు.

బాసిలర్ ఆర్టరీ స్టెనోసిస్ 

డాక్టర్ అన్నపురెడ్డి జగదీష్ మాట్లాడుతూ, “బాసిలర్ ఆర్టరీస్టెనోసిస్ అనేది అత్యంత ప్రమాదకరమైన స్ట్రోక్ వ్యాధుల్లో ఒకటి. ఇది శ్వాస, చైతన్యం, మింగడం, మాట్లాడటం, శరీర సమతుల్యత వంటి కీలక మెదడు కార్యకలాపాలను నియంత్రించే బ్రెయిన్‌స్టెమ్‌పై ప్రభావం చూపుతుంది. మందులతో కూడా స్ట్రోక్స్ ఆగకపోతే, సమయానికి చేసే న్యూరో ఇంటర్వె న్షన్ రోగి ప్రాణాలను కాపాడగలదు” అని తెలిపారు. భారతదేశంలో స్ట్రోక్ మరణాలు, వైకల్యాలకు ప్రధానకారణాల్లో ఒకటిగా మారుతోంది. 

ప్రతి సంవత్సరం సుమారు 18 లక్షల స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయని నిపుణులు చెపుతున్నారు. వీటిలో 20శాతం పోస్టీ రియర్ సర్క్యులేషన్ స్ట్రోక్స్ కాగా, బాసిలర్ ఆర్టరీ ప్రభావితమైన కేసుల్లో మరణాలు, శాశ్వ తవైకల్యాల ప్రమాదం మరింత అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. హైబీపీ, డయాబెటిస్, ధూమపానం, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, గుండె వ్యాధులు వంటి ప్రమాదకర కారకాలు యువత, మధ్య వయస్సు వారిలో స్ట్రోక్ భారాన్ని పెంచుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు.