16 May, 2026 | 4:53 PM

గ్రామీణ ప్రజలకు మెడికవర్ ఆసుపత్రి ఉచిత వైద్య సేవలు

16-05-2026 04:03 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నరసింహులపల్లి గ్రామంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శిబిరంలో సుమారు 150 మందికి పైగా రోగులను నిపుణులైన వైద్యులు పరీక్షించి వైద్య సేవలు అందించారు. రోగులకు షుగర్, బీపీ, ఈసీజీ, 2డి ఎకో వంటి ముఖ్యమైన పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తక్షణ చికిత్స అందించారు. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అవసరమైన రోగులను కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రికి తరలించి ఆధునిక వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ లింగారెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించిన మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.