అతిథి పక్షులకు స్వర్గధామం మేచరాజుపల్లి
బండి సంపత్ కుమార్
మహబూబాబాద్, (విజయక్రాంతి) :
* అనేక సంవత్సరాలుగా వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే విదేశీ అతిథి పక్షులకు స్వర్గధామంగా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి నిలుస్తోంది. ప్రకృతి అందాలతో నిండిన ఈ గ్రామంలోని చెరువులు, చెట్లు వలస పక్షులను అక్కున చేర్చుకుని, ఆశ్రయం ఇచ్చి.. పురుడుపోస్తున్నాయి.
అతిథి పక్షులపై మమకారం.. మానవత్వం కురిపిస్తూ.. కరుణిస్తూ.. సంరక్షణ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ.. ఈ ప్రాంతాన్ని విదేశీ పక్షుల పుట్టినిల్లుగా ఏళ్ల తరబడి నిలబెడుతున్న గ్రామస్తులు ఎంతో స్ఫూర్తినిస్తున్నారు. పక్షుల తల్లిప్రేమను, పిల్లల కేరింతలను, మురిపాలను చూసి సందర్శకులు ఆహ్లాదంతో మంత్రముగ్ధులవుతున్నారు.
సైబీరియా వంటి చల్లని ప్రాంతాల నుంచి పక్షులు, ముఖ్యంగా కొంగలు (పెయింటర్ స్టోర్క్) మేచరాజుపల్లికి తరలివచ్చి, నివాసం ఏర్పరచుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వేలసంఖ్యలో సైబీరియన్ కొంగలు, ఇతర వలస పక్షులు చేరుకుంటాయి. చల్లని దేశాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వేడి ప్రాంతాల కోసం ఈ పక్షులు వేల కిలోమీటర్ల దూరం ప్రయా ణించి ఇక్కడకు ప్రతి ఏటా క్రమం తప్పకుం డా వస్తాయి.
డిసెంబర్ నుంచి జూలై వరకు గ్రామంలోని చెట్లపై గూళ్లు కట్టి గుడ్లు పెట్టి సంతానోత్ప త్తి చేసి, పిల్లలు పెద్దయ్యాక తిరిగి జూలై నెలలో పిల్లలతో కలిసి తమ స్వదేశాలకు వెళ్లిపోతాయి. వీటి ప్రధా న ఆహారం చెరువులోని చేపపిల్లలు. చేప పిల్లలను వేటాడి చెట్లపై నిలువ పెట్టుకోవడం మరో ప్రత్యేకతగా నిలుస్తోంది.
ప్రకృతి మధ్య పక్షుల సందడి..
మేచరాజుపల్లి చెరువు పరిసర ప్రాంతా ల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో పక్షుల కిలకిలారావాలు వినిపిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటాయి. గుంపులుగా ఎగిరే పక్షు లు ఆకాశంలో అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తా యి. ఈ కాలంలో చెట్లపై కనిపించే వందలాది విదేశీ అతిథి పక్షులను చూసేందుకు సమీప ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తుంటారు.
గ్రామస్థుల సంరక్షణ..
గ్రామస్థులు ఈ పక్షులను తమ అతిథులుగా భావించి, సంరక్షణ చర్యలు చేపడుతు న్నారు. ప్రతి ఏడాదీ వచ్చే విదేశీ అతిథి పక్షు ల రాక కోసం నిరీక్షించడం, చెట్లను నరకకుండా కాపాడటం, పక్షులకు ఇబ్బంది కలి గించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా అతిథి పక్షులపై మమకారం.. మానవత్వం కురిపిస్తూ.. కరుణిస్తూ.. సంరక్షణ బాధ్యతలను తు.చ తప్పకుండా నిర్వర్తిస్తూ.. ఈ ప్రాంతాన్ని విదేశీ పక్షుల ఆవాసంగా ఏళ్ల తరబడి నిలబెట్టుతున్నారు.
ఒక్కో పక్షి మూడు నుంచి నాలుగు గుడ్లు పెట్టి, 30 నుంచి 45 రోజుల పాటు పొదుగుతుంటాయి. జన్మించిన తమ పిల్లలకు ఇక్కడే ఎగరడం, మేత మేయడం, ఆహారాన్ని సంపాదించడం తదితర నైపుణ్యాలను తల్లి పక్షులు నేర్పిస్తుంటాయి. ఈ ప్రకృతి విన్యాసాలను, తల్లిప్రేమను, పిల్లపక్షుల కేరింతల ను, మురిపాలను చూసి సందర్శకులు ఆహ్లాదంతో మంత్రముగ్ధులవుతుంటారు.
పర్యాటకంగా మారే అవకాశం..
ప్రకృతి అందాలు, విదేశీ వలస పక్షుల సందడి కారణంగా మేచరాజుపల్లి పర్యాటక కేంద్రంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సరైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే పక్షి ప్రేమికులకు, ప్రకృతి సందర్శకులకు ఆకర్షణీయ ప్రాంతంగా అభివృద్ధి చెం దుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పక్షుల సంరక్షణకు చెరువు అభివృ ద్ధి, చెట్ల సంరక్షణ, పర్యాటక సదుపాయాల కల్పన వంటి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పర్యావరణ పరిరక్షణ తో పాటు పర్యాటకాభివృద్ధి జరిగితే మేచరాజుపల్లి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. వేల కిలోమీటర్ల ప్రయా ణం చేసి వచ్చే అతిథి పక్షులతో మేచరాజుపల్లి ప్రకృతి సోయగంగా మారుతూ నిజమై న పక్షుల స్వర్గధామంగా నిలుస్తోంది.




