6 May, 2026 | 7:41 PM

Breaking News

జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •   ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన   •   నాగోల్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల వేగం పెంచాలి   •   పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి - సిపిఐ   •   పంటల మార్పిడి విధానాన్నీ రైతులు అవలంబించాలి   •   కులర్ కరెంట్ షాక్‌తో బాలుడికి గాయాలు   •   పట్వారిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •  

ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా దరఖాస్తు గడువు పొడిగింపు

26-07-2025 12:50 AM
  1.    30 వరకు పొడిగిస్తూ నోటిఫికేషన్ 
  2. విడుదల చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును పొడిగిస్తూ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్) శుక్రవారం నోటిఫికేష్ జారీ చేసింది. 2025--26 అకాడమిక్ ఏడాదికి గాను అర్హత పొందిన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ వెల్లడించింది.

అభ్యర్థులు, తల్లిదండ్రుల నుంచి అందిన పలు విజ్ఞప్తులతో పాటు స్థానిక/స్థానికేతర సమస్యకు సంబంధించిన కోర్టు కేసు కారణంగా దరఖాస్తు గడువును పొడిగించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. గతంలో ఈనెల 15న విడుదల చేసిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా ఈ పొడిగింపు జరిగిందని పేర్కొన్నారు.

నీట్ యూజీ--2025 కటాఫ్ స్కోర్లు:

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు నీట్ యూజీ--2025లో కింది కటాఫ్ స్కోర్లు సాధించి ఉండాలని కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్ వెల్లడించింది. జనరల్ కేటగిరీ (ఈడబ్ల్యూఎస్‌తో సహా) 50వ పర్సంటైల్, 144 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/బీసీ మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ కేటగిరీకి చెందిన అభ్యర్థులు 40వ పర్సంటైల్, 113 మార్కులు, ఓసీ కేటగిరీకి చెందిన దివ్యాంగులు 45 పర్సంటైల్, 127 మార్కులు సాధించి ఉండాలి.

అభ్యర్థులు <https://tsmedadm. tsche.in> వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని, అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలని సూచించారు. దరఖాస్తు సమర్పణలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే 9392685856, 9059672216, 7842136688 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.