13 March, 2026 | 11:01 AM

డిప్యూటీ మేయర్‌ను సన్మానించిన మేయర్ కొలగాని

13-03-2026 12:00 AM

కరీంనగర్, మార్చి 12 (విజయక్రాంతి): నగరంలోని 42 వ డివిజన్ భగత్ నగర్ లో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావును గురువారం  మేయర్ కొ లగాని శ్రీనివాస్ సన్మానించారు. డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతిని ధిగా నియమించిన నేపథ్యంలో క్యాంపు కార్యాల యంలో పూల మొక్క అందించి... శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ బండారి వేణు, రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.