23 March, 2026 | 12:36 AM

ప్రజలందరి జీవితాల్లో ఆనందాలు నిండాలి

22-03-2026 12:00 AM

ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, మార్చి 21(విజయక్రాంతి): రంజాన్ పురస్కరించుకొని ప్రజలందరి జీవితాల్లో ఆనందాలు నిండాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆకాంక్షించారు. యూసఫ్ గూడ చెక్ పోస్ట్ పోలీస్ గ్రౌండ్ లో శనివారం జరిగిన ఈద్ ఉల్ ఫితర్ వేడుకలకు ముఖ్య ఆహ్వానితులుగా హాజరై ముస్లిం సోదర సోదరీమణు లకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్ర మశిక్షణతో, భక్తిశ్రద్ధలతో నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు పూర్తి చేసుకున్న ముస్లిం సోదర సోదరీమణులకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

తనను సాదరంగా ఆహ్వానించి శాలు వా టోపీతో సత్కరించిన ముస్లిం పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి ఈ రంజాన్ పండుగ సుఖసంతోషాలను తీసుకురావాలని మనస్ఫూర్తి గా కోరు కుంటున్నానన్నారు. అల్లా ఆశీస్సులతో అంద రి కుటుంబాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా ఉంటూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయలు, కార్యకర్తలు తదితరులున్నారు.