18 May, 2026 | 5:34 PM

వివాహిత దారుణ హత్య ...

18-05-2026 04:45 PM

చెన్నూర్,( విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం ఎల్లక్కపేట గ్రామంలో గృహిణి హత్యకు గురైన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన చల్ల శారద (24) అనే వివాహితను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు సమాచారం. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ హత్యను ఆమె భర్త రమేష్ సుత్తితో దాడి చేసి చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.