13 April, 2026 | 5:16 AM

కూకట్‌పల్లిలో మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్

13-04-2026 03:37 AM

మెగా షోరూమ్‌ను ప్రారంభించిన విక్టరీ వెంకటేష్

హైదరాబాద్, ఏప్రిల్ 12(విజయక్రాంతి): భాగ్యనగర పసిడి ప్రియుల చిరకాల వాంఛ నెరవేరుస్తూ, కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ సమీపంలో ‘మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్’ మెగా షోరూం ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జంట నగరాల్లోనే అతిపెద్దదిగా, నాలుగు అంతస్తుల విశాలమైన భవనంలో అంతర్జాతీయ హంగులతో తీర్చిదిద్దిన ఈ షోరూంను ప్రముఖ సినీ నటుడు, విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రా రంభించారు.

అనంతరం షోరూంలోని అ ద్భుతమైన కలెక్షన్లను తిలకించిన వెంకటేష్ మాట్లాడుతూ ‘హైదరాబాద్ ప్రజలకు వేలా ది సరికొత్త డిజైన్లను ఒకే చోట అందించడం అభినందనీయం అన్నారు. ముఖ్యంగా సా మాన్యులకు భారం కాకుండా సంవత్సరం పొడవునా అతితక్కువ తరుగు ధరలకే బం గారం అందించాలనే యాజమాన్యం ఆలోచన చాలా గొప్పది,’ అని కొనియాడారు.

షోరూం ప్రత్యేక ఆఫర్లు అండ్ వివరాలు:

1.బంగారం ఆభరణాలపై (గోల్డ్ ఆఫర్స్):

తరుగు (వీఏ): కేవలం 1% నుంచి 11% వరకు మాత్రమే. ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం పండుగలకు మాత్రమే పరిమితం కాకుండా, సంవత్సరంలో 365 రోజులూ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

అక్షయ తృతీయ స్పెషల్: ప్రస్తుతం ప్రారంభోత్సవం, అక్షయ తృతీయ సందర్భంగా పైన పేర్కొన్న వీఏ పై అదనంగా 25% తగ్గింపు లభిస్తుంది.

మేకింగ్ ఛార్జీలు: ఆభరణాల తయారీ ఖర్చులు పూర్తిగా రద్దు (సున్నా).

నాణ్యత: ప్రతి ఆభరణం బీఐఎస్ 916 హాల్మార్క్ ముద్రతో లభిస్తుంది.

2. వెండిపై భారీ ధమాకా (సిల్వర్ ఆఫర్స్):

 వెండి వస్తువులపై ఎటువంటి తరుగు (వెస్టేజ్) లేదు.

 మేకింగ్ ఛార్జీలు, జీఎస్‌టీ పూర్తిగా రద్దు చేయబడ్డాయి.

 1 కేజీ పైన వెండి కొనుగోలుపై ఏకంగా రూ.20 వేల వరకు నగదు తగ్గింపు పొందవచ్చు.

3. డైమండ్స్ ప్రత్యేక ధర (డైమండ్ ఆఫర్):

అత్యున్నత నాణ్యత కలిగిన డైమండ్స్ క్యారెట్ కేవలం రూ.49,900లకే లభ్యం.

వినియోగదారుల కోసం వినూత్న పథకాలు:

రేటు ప్రొటెక్షన్ స్కీమ్: 6 నెలల కాలపరిమితి గల ఈ పథకంలో, బుక్ చేసిన రోజు లేదా డెలివరీ తీసుకునే రోజు... ఏ రోజు ధర తక్కువగా ఉంటే ఆ ధరకే బంగారం పొందవచ్చు.

గోల్ సేవింగ్ స్కీమ్ (10 నెలలు): నెలకు కొంత మొత్తం పొదుపు చేయడం ద్వారా, 10 నెలల తర్వాత ఎటువంటి వీఏ చార్జీలు లేకుండా ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు.