13 May, 2026 | 1:54 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

సారపాకపల్లె వద్ద గంజాయి లభ్యం

25-01-2026 12:17 AM
  1. వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడిన ముగ్గురు
  2. కేసు నమోదు చేసిన పోలీసులు

బూర్గంపాడు, జనవరి 24 (విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలోని సార పాక పల్లె ప్రకృతి వనం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి పట్టుబడ టంతో ముగ్గురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మేడా ప్రసాద్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సారపాక పల్లె ప్రకృతి వనం వద్ద ఎస్‌ఐ నాగభిక్షం సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పక్కా గంజాయి సరఫరా జరుగుతుందని ముందస్తు సమాచారం ఉండడంతో పకడ్బందీగా వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్‌పై ఉన్న ముగ్గురు వ్యక్తులు అను మానాస్పదంగా ఉండి పోలీస్ సిబ్బందిని చూసి పారిపోయారు.

వెంటనే అనుమానం వచ్చి వెంబడించి షేక్ సాదిక్,సయ్యద్ మౌలాలి,బెజవాడ గోపి పట్టుకొని తనిఖీ చేయగా 3.2 కేజీల గంజాయి పట్టుబడింది. డొంకరాయ్ నుంచి ఖమ్మం పట్టణానికి తీసుకువెళ్తున్నట్లు పట్టుబడిన నిందితులు విచారణలో ఒప్పుకున్నారు.వారిని బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించి ముగ్గురు పై కేసు నమోదు చేయగా,మరో ఇద్దరు పరారిలో ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.