పెద్దమ్మ గుడిలో విషాదం.. ప్రాణం తీసిన కొత్త కారు
29-08-2026 11:18 AM
కొత్త కారు పూజకు వెళ్లి అదే కారు కిందపడి వ్యక్తి మృతి
హైదరాబాద్: కొత్త కారు పూజకని వెళ్లి అదే కారు కిందే పడి వ్యక్తి మృతిచెందిన ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. మేనల్లుడు కొన్న కొత్త కారు పూజకు రామచంద్రరావు(70) మియాపూర్ లోని కూతురు ఇంటికి వెళ్లాడు. బంధువులతో కలిసి రామచంద్రరావు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి(Jubilee Hills Peddamma Temple) వెళ్లాడు. పూజ తర్వాత మేనల్లుడు కారు తీసే క్రమంలో ప్రమాదం జరిగింది. యాక్సిలరేటర్(Accelerator) నొక్కడంతో కారు అదుపుతప్పి ఒక్కసారిగా రామచందర్ రావుపైకి దూసుకుపోయింది. తీవ్ర గాయాలపాలైన ఆయనను తక్షణమే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామచంద్రరావు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






