21 August, 2026 | 9:37 AM

పెన్షన్‌ కోసం వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన వ్యక్తి

21-08-2026 08:42 AM

బిక్కనూర్, ఆగస్టు 21 (విజయక్రాంతి): బిక్కనూర్ మండలం కంచర్ల గ్రామానికి చెందిన గొల్ల రాములు పెన్షన్‌ మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. గతంలో తనకు పెన్షన్‌ వచ్చేదని, ప్రస్తుతం అర్హత ఉన్నప్పటికీ మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటల పాటు ట్యాంక్‌పైనే ఉండటంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్థులు అక్కడికి చేరుకుని రాములును కిందకు దించారు.మూర్ఛ వ్యాధి తో బాధపడుతున్న, సధరం సర్టిఫికెట్ లేకపోవడం వల్ల పెన్షన్ రావడం లేదని స్థానికులు తెలిపారు. గతంలోనూ గ్రామసభ సమయంలో పెన్షన్ కోసం  చెట్టుపైకి ఎక్కి ఉరివేసుకునేందుకు ప్రయత్నించగా గ్రామస్థులు సర్ది చెప్పి కిందకు దించిన విషయం తెలిసిందే .ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు పెన్షన్‌ మంజూరు చేయాలని రాములు కోరారు.