108 సేవలను సద్వినియోగం చేసుకోండి
ఆళ్లపల్లి,(విజయక్రాంతి): ఆపద సమయంలో ప్రాణాలను కాపాడే 108 అత్యవసర అంబులెన్స్ సేవలను మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని 108 ప్రోగ్రాం అధికారి నజీరుద్దీన్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 108కు సమాచారం అందించి, వేగవంతమైన వైద్య సేవలను పొందాలని ఆయన కోరారు. ఆళ్లపల్లి మండల కేంద్రంలోని 108 అంబులెన్స్‌ను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నజీరుద్దీన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోఆర్డినేటర్ సతీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అంబులెన్స్‌లోని అత్యవసర పరికరాలు, మందులు, ఆక్సిజన్ సిలిండర్ పనితీరుతో పాటు వాహన లాగ్‌బుక్, కేస్‌షీట్లు తదితర రికార్డులను పరిశీలించారు.అనంతరం విధుల్లో ఉన్న ఈఎంటీ భాగ్యమ్మ, పైలెట్ శ్రీహర్షలకు పలు సూచనలు చేశారు. అత్యవసర సమయంలో ప్రజలకు మరింత వేగంగా, మెరుగైన సేవలు అందించేందుకు అంబులెన్స్‌ను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.ఆళ్లపల్లి మండల ప్రజలు అత్యవసర సమయంలో 108 సేవలను సద్వినియోగం చేసుకోండి. మీ ప్రాణాలను కాపాడేందుకు 108 ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది” అని ప్రోగ్రాం అధికారి నజీరుద్దీన్ తెలిపారు.






