12 March, 2026 | 8:08 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

12-03-2026 06:01 PM

మఠంపల్లి మార్చి 12 (విజయ క్రాంతి): టియుసిఐ రాష్ట్ర రాజకీయాల తరగతులను జయప్రదం చేయుటకై మఠంపల్లి మండలంలో కరపత్రం ఆవిష్కరణ జిల్లా నాయకురాలు ఎం.సునీత ఆధ్వర్యంలో చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 

వివిధ రంగాల కార్మికుల తమ సమస్యల పట్ల హక్కుల పట్ల బాధ్యతల పట్ల అవగాహన కల్పించడానికి రాజకీయ శిక్షణ తరగతులను మార్చి 14,15వ తారీఖున సూర్య పేట జిల్లా కేంద్రంలో కిరణా మర్చంట్ హల్ నందు నిర్వహిస్తున్నామని, సంఘటిత ఆ సంఘటిత  కార్మికులకు జీవన భద్రత ఉద్యోగ భద్రత పని పరిస్థితుల మెరుగుకై భారతదేశంలో 40 కోట్ల కార్మిక వర్గం పోరాడుతుందని,కార్మిక సంక్షేమానికి పాటుపడాల్సిన కార్మిక శాఖ అధికారులను తగ్గించిందని,యజమాన్యాల దోపిడీని తీవ్రతరం చేయడానికి కార్మికుల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసుకోవడానికి విశేష అధికారులను మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యజమాన్యానికి కల్పించిందని తెలిపారు.ఈ శిక్షణ తరగతులను విద్యార్థులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో హేమావతి,ఏ. నాగేంద్ర,కె.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.