నేడు 17వ శ్రీ హనుమాన్ దీక్ష స్వాముల మహా మండలపూజను విజయవంతం చేయండి
హాజరుకానున్న పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ..
అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్ష సేవా సమితి పిలుపు..
బాన్సువాడ, మార్చ్ 20 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం ఆవరణలో శనివారం రోజున నిర్వహించే 17వ శ్రీ హనుమాన్ దీక్ష స్వాముల మహా మండల పూజను భక్తులు శ్రీ హనుమాన్ దీక్ష స్వాములు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అఖిలభారత శ్రీ హనుమాన్ దీక్ష సేవాసమితి గురు స్వాములు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ మార్చి 21న శనివారం విశ్వశాంతి కొరకు అష్టోత్తర శత కుండాత్మక( 108) సుందరకాండ పారాయణ సహిత 162 వ శ్రీ హనుమాన్ మహా యజ్ఞం, శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, వడల పూజ మహోత్సవం చేపట్టుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సుందరకాండ పారాయణ సహిత మహా యజ్ఞం మార్చ్ 21 న శనివారం నాడు ప్రారంభమై 22 ఆదివారం మధ్యాహ్నం ఒంటి వరకు నిర్విరామంగా కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. ఈ ఈ కార్యక్రమంలో శ్రీ హనుమాన్ దీక్ష సేవా సమితి బాన్సువాడ ప్రతినిధులు అంబిలిపూర్ రాజు స్వామి, పాలకుర్తి దత్తు స్వామి, సాయ గౌడ్ స్వామి, గోకన్ శంకర్ గౌడ్ స్వామి, తేలి మహేష్ కుమార్ స్వామి,కల్లేటి వెంకటరమణ స్వామి తదితరులు పాల్గొన్నారు.




