5 April, 2026 | 8:17 AM

ఆఫ్గనిస్తాన్‌లో భారీ భూకంపం

04-11-2025 12:55 AM

 20 మంది మృతి.. 300 మందికి పైగా గాయాలు

కాబూల్, నవంబర్ 3 : ఆఫ్గనిస్తాన్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో ఏడుగురు మృతిచెందారు. 300 మందికి పైగా గాయాలయ్యాయి. ఇంకా అనేక మంది శిథిలాల కిందనే చిక్కుకున్నారు. రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రత నమోదైందని, ఖుల్మ్ సమీపంలో దాదాపు 26 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) పేర్కొంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున మరోసారి పెద్ద భూకంపం వచ్చింది.

మజార్ ఈ షరీఫ్ నగరం, ఖుల్మ్ పట్టణానికి సమీపంలో భారీ భూకంపం సంభవించిందని, రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రతతో నమోదైందని ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి. ఈ విపత్తు వల్ల 20 మంది మృతి చెందారని, 300 మందికి పైగా గాయపడ్డారని, యూఎస్‌జీఎస్ అధికారులు అంచనా వేశారు.

ఇంకా అనేక మంది శిథిలాల కిందనే చిక్కుకున్నారని, మృతుల సంఖ్య ఇంకా పెరుగొచ్చని తెలిపారు. అనేక ఇళ్లు కూలిపోయాని, చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని చెప్పారు. అంతేకాదు దేశంలోని అనేక ప్రావిన్సులలో రాత్రి 1 గంటకు కూడా బలమైన భూప్రకంపనలు సంభవించినట్టు ఆఫ్ఘనిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఒక ప్రకటలో పేర్కొంది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోనితజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్‌లోనూ ప్రకంపనలు సంభవించాయి.