28 March, 2026 | 6:26 PM

Breaking News

గర్భిణీ స్త్రీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి   •   ఆశా కార్యకర్తల అరెస్టు తగదు   •   తిరుమలగిరి జడ్‌పిహెచ్‌ఎస్‌లో ఎస్సెస్సీ పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన ఎంఆర్వో   •   జాతీయస్థాయిలో జిల్లా కలెక్టర్ నిర్మల్ దక్కిన గౌరవం   •   ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్   •   వికలాంగులకు 6 వేల పెన్షన్ హామీ ఏమైంది....?   •   మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •  

ఇప్పపువ్వుతో ప్రభుత్వానికీ, ఆదివాసీలకు కోట్ల ఆదాయం

26-03-2026 12:38 AM

అసెంబ్లీలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

జడ్చర్ల, మార్చి 25: పప్పుతో ప్రభుత్వానికి ఆదివాసీలకు కోట్ల ఆదాయం సమకూర్తుందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీలో ఇప్పప్పుపై ప్రత్యేకంగా ఎమ్మెల్యే సంభాషించారు. టకీలా పదేళ్ల లోనే మెక్సికో టకీలాను అధిగమిస్తుందని, ఇప్పపువ్వు మద్యానికి 5 వేల ఏళ్ల ఘన చరిత్ర ఉందన్నారు. బ్రిటీష్ పాలకులు ఇప్పపువ్వు మద్యాన్ని నిషేధించడం వెనక కుట్ర ఉందని,విదేశాల్లో ఇప్పపువ్వు ను దిగుమతి చేసుకొని మద్యం తయారు చేస్తున్నారన్నారు.

మన దేశంలోనూ అనేక రాష్ట్రాల్లో ఇప్పపువ్వు మద్యానికి అనుమతులు ఇచ్చారని, ప్రధాని మోదీ మన్ కీ బాత్ లోనూ ఇప్పపువ్వు లను లడ్డూలుగా ప్రశంసించారని పేర్కొన్నారు.ఇప్ప టకీలా తయారీ కోసం ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని సభా దృష్టికి తీసుకువచ్చారు. ఆదివాసీ గిరిజనులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 1994 లో సారా నిషేధం విధించక ముందు సారా వల్ల ఆదాయం రూ.370 కోట్లు ఉంటే ఇతర విదేశీ మద్యం వల్ల ఆదాయం కేవలం రూ.8 లక్షలు మాత్రమే ఉండేదని చెప్పారు.

అయితే సారా నిషేధం విధించిన తర్వాత విదేశీ మద్యం ఆదాయం ఒక్కసారిగా రూ.700 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఒక మొక్కతో మెక్సికో తయారు చేసే టకీలా అమ్మకాల ద్వారా ఏడాదికి రూ.2.35 లక్షల కోట్లు ఆర్జిస్తుంటే, చైనా జొన్నలు, గోధుమలతో తయారు చేస్తున్న మహుటాయ్ అనే సాంప్రదాయక మద్యాన్ని అమ్మడం ద్వారా రూ.2.26 కోట్లు గడిస్తోందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఇప్ప చెట్లను పెంచడానికి కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.