28 March, 2026 | 4:54 PM

Breaking News

మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •   ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి   •  

గజ్వేల్‌కు చేరిన సోమనాథ్ లింగం శకలాలు

26-03-2026 12:39 AM

భక్తి భావంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజలు 

గజ్వేల్, మార్చి 25: అతి పురాతనమైన పవిత్ర సోమనాథ్ శివలింగం శకలాలు బుధవారం గజ్వేల్ కు చేరుకు న్నాయి. ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలంగాణ ఆధ్వర్యంలో 1000 సంవత్సరాల కన్న పురాతన సోమనాథ్ జ్యోతిర్లింగ శకలాల దివ్య దర్శనం చేసుకునే అవకాశాన్ని గజ్వేల్ ప్రాంత ప్రజలకి కలిగించారు.

ప్రజ్ఞా గార్డెన్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సోమనాథ్ లింగ శకలాలకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి, మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మున్సిపాల్ ఛైర్పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, గజ్వేల్ పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు.