పారాదీప్‌కు ‘హెరాల్డ్’ నౌక
03-07-2026 12:00 AM
- సురక్షితంగా ఇరాక్ నుంచి భారత్‌కు ఇంధన ట్యాంకర్
- హోర్ముజ్‌లో కాల్పులు.. సమయస్ఫూర్తితో ముందుకు
భువనేశ్వర్, జూలై 2: ఒడిశాలోని పారాదీప్ పోర్టుకు ఇరాక్ నుంచి 2 మిలియన్ బ్యారెళ్ల చమురును మోసుకొచ్చిన ‘ఎంటీ సన్మార్ హెరాల్డ్’ సురక్షితంగా చేరుకుంది. ఈ విషయాన్ని గురువారం పోర్ట్ అథారిటీ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ నౌకపై హోర్ముజ్ జలసంధిలో దాడి కూడా జరిగింది. అత్యంత క్లిష్టపరిస్థితులను సమర్థవం తంగా ఎదుర్కొని, నౌకలోని సిబ్బంది భద్రత దృష్ట్యా దాడి అనంతరం నౌక తన మార్గాన్ని మార్చుకుంది. భద్రతా ఉల్లంఘనలు లేకుండా ముందుకు కదులుతూ ఎట్టకేలకు పారాదీప్‌కు చేరింది.






