24 April, 2026 | 4:21 AM

విద్యుత్ షాక్‌తో లైన్‌మన్ శ్రావణ్ మృతి

24-04-2026 12:00 AM

అయిజ ఏప్రిల్ 23: అయిజ మండలంలోని చిన్న తాండ్రపాడు గ్రామంలో విద్యుత్ షాక్ తో శ్రావణ్ అనే లైన్మెన్ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాల్లోకి వెళితే అయిజ మండలంలోని మేడికొండ గ్రామస్తుడైనా శ్రావణ్ గత కొంతకాలంగా విద్యుత్ శాఖలో ఒప్పంద ఉ ద్యోగిగా పనిచేస్తూ ఉండేవాడని, ఈ మధ్యనే పర్మినెంట్ ఉద్యోగిగా మారాడని, చిన్నతాండ్రపాడు, కేశవరం, ఉప్పలక్యాంపు మొదలగు గ్రామాలకు లైన్ మెన్ గా పనిచేసేవా డని,అతనికి భార్య ఉన్నదని శ్రావణ్ తల్లిదండ్రులు తెలియజేశారు.

మంగళవారం రాత్రి కురిసిన ఈదురుగాలులు భారీ వర్షానికి చిన్నతాండ్రపాడు గ్రామంలో కరెంటు స్తంభాలు కూలిపోయి అక్కడక్కడ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల వాటిని సరిచేసే క్రమంలో ఈరోజు విధి నిర్వహణలో విద్యుత్ షాక్ తో మృతి చెందాడని ఇద్దరు గాయపడ్డాడని, గాయపడిన ఇద్దరినీ కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు గ్రామస్తులు తెలియజేశారు.

విద్యుత్ శాఖలో పనిచేసే ఒక ఉద్యోగి విద్యుత్ తో పనిచేస్తుండగా వాస్తవానికి ఎల్ సి   ఇచ్చి పని చేయించాలి. ఒకవేళ సిబ్బంది ఎల్ సి ఇచ్చినట్లయితే ఈ ప్రమాదం ఎలా జరుగిందని, ఎల్ సి ఇచ్చిన అనుకోకుండా కరెంటు తీగ ఎక్కడైనా టచ్ అయిందా ? అది గమనించకుండా పనిచేస్తుండగా విద్యుత్ షాక్ కి గురయ్యాడా ? అనే కోణంలో కూడా మేడికొండ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

విద్యుత్ పని కోసం పిలిస్తే పలికే శ్రావణ్ మరణించడంతో మేడికొండ గ్రామం చిన్నతండపాడు గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. ఈ విషయం గురుంచి వివరణ కోసం విద్యుత్ శాఖ సిబ్బందిని చరవాణి ద్వారా విలేకరి సంప్రదించాలని ప్రయత్నిస్తే అధికారులు ఎవరూ స్పందించలేదు.