9 May, 2026 | 10:42 AM

Breaking News

కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •  

దివ్యాంగులను ఆదరిద్దాం

03-12-2025 05:02 PM

నిర్మల్ (విజయక్రాంతి): దివ్యాంగులను సమాజం ఆదరించాలని, వారిని ఎప్పుడు కూడా చిన్నచూపు చూడొద్దని, వారిని జనజీవన స్రవంతిలో కలుపుకోవాలని, వారిలోని శక్తియుక్తులను, సృజనాత్మకతలను సమాజం వాడుకోవాలని మండల విద్యాధికారి తోడిశెట్టి పరమేశ్వర్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక విలీన భవిత కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని దివ్యాంగులైన పిల్లలకు ప్రభుత్వం ద్వారా లభించనున్న వివిధ రకాల పథకాలను అవకాశాలను రిజర్వేషన్లను గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగుల పిల్లలకు వివిధ పాటల పోటీలను నిర్వహించి బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఎంపీడీవో సురేష్, ఎంపిఓ జ్యోతి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు త్రివేణి, విలీన భవిత కేంద్రం ఇన్స్ట్రక్టర్ సంధ్య రాణి పోషకులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.