29 June, 2026 | 10:03 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

సమన్వయం పాటించండి.. పరిష్కరించుకుందాం

15-04-2026 12:00 AM

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ టౌన్, ఏఫ్రిల్ 14 : కాంట్రాక్టు విద్యుత్తు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా నని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  హామీ ఇచ్చారు. మంగళవారం కాంట్రాక్టు టెక్నికల్ ఫీల్ ఉద్యోగులు విద్యార్హతలు లను బట్టి ఎపిఎస్‌ఇబి రూల్స్ అమలు చేయాలని ఉమ్మడి జిల్లా కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ప్రభుత్వ విప్ ని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.

విద్యుత్ ఉద్యోగుల సమస్యలు శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సమస్యల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కాంట్రాక్టు విద్యుత్తు ఉద్యోగుల సంఘం చైర్మన్ జఖి, డివిజన్ చైర్మన్ పెంటయ్య, నాయకులు తిరుమలేష్, గౌరయ్య, శ్రీను, హన్మంతు రెడ్డి, నజీర్ తదితరులు పాల్గొన్నారు.