8 June, 2026 | 7:20 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం

08-06-2026 05:54 PM

- జూనియర్ సివిల్ జడ్జి వి.మాధవి

మెట్ పల్లి,(విజయక్రాంతి): ఈ నెల ఇరవై తేదిన జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం అని మెట్ పల్లి జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి పిలుపునిచ్చారు. మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రో లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ... కక్షిదారులు పరస్పరం రాజీ పడటంలో న్యాయవాదులు, పోలీసులు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. మీడియాషన్ కో ఆర్డినేటర్లు కూడా కాక్షిదారులని కౌన్సిలింగ్  ద్వారా రాజీ పడేట్టు కృషి చేయాలని పేర్కొన్నారు. శ్రీరామ్ చిట్స్ మరియు కెనరా బ్యాంకు మేనేజర్లు కూడా వారి ఖాతాదారులపై కేసులు విరమించు కోవడానికి చర్చల ద్వారా ప్రయత్నించాలని కోరారు.