18 May, 2026 | 2:47 AM

నేర్చుకో !

18-05-2026 12:00 AM

ఓటమి శాశ్వతం కాదు 

సంద్రాన అలలా

పడిపైకి లేవడం నేర్చుకో

అడ్డుతగిలే దుర్మార్గులు

ఎదురవుతారు ఈ జీవనయానంలో

చాకచక్యంగా తప్పించుకోవడం నేర్చుకో 

మబ్బులు వచ్చి పోతుంటాయి

నీలినీడలను తెస్తుంటాయి

సూర్యుడిలా వెలగడం నేర్చుకో 

ప్రయాణంలో ఎగుడు దిగుళ్లు

దారి వెంట ముళ్లుంటాయి

గులాబీలా గుబాళించడం నేర్చుకో 

ఎవరితో ఉండాలో నేర్చుకో

ఏడుస్తూ జన్మించాం..

జీవితంలో కొన్నిసార్లు దుఃఖిస్తున్నాం

కంటనీరు కొత్తేమీ కాదని నేర్చుకో !!