వేములవాడ భీమన్నను దర్శించుకున్న హీరో అఖిల్ రాజ్
- భీమేశ్వర స్వామికి అభిషేకం
- కోడె మొక్కులు
- బద్ది పోచమ్మకు ప్రత్యేక పూజలు
వేములవాడ,(విజయక్రాంతి): ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా హీరో అఖిల్ రాజ్ శుక్రవారం వేములవాడ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు.
ఈ సందర్భంగా అఖిల్ రాజ్ మాట్లాడుతూ చిన్నతనం నుంచే వేములవాడ రాజన్నపై భక్తి ఉందని, తరచూ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నట్లు తెలిపారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు సంతోషం కలిగిస్తున్నాయన్నారు. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరితో కలిసి ‘క్రేజీ కళ్యాణం’ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. రాజన్న స్వామివారి ఆశీస్సులతో తన సినిమాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.






