17 June, 2026 | 10:08 AM

అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్

17-06-2026 08:54 AM

హైదరబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ల్యాండ్ అండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్(Land Survey Deputy Director Narahari Sent to Remand) సుంకరి నరహరిరావుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ పడింది. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఏసీబీ అధికారులు నరహరిరావును ప్రత్యేక న్యాయస్థానం ముందు పరిచారు. నరహరిని చంచల్ గూడ జైలుకు తరలించారు. అక్రమ ఆస్తుల కేసు నమోదైన నేపథ్యంలో, తెలంగాణ సర్వే, భూ రికార్డుల శాఖ (మల్టీ జోన్-2) డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావును అవినీతి నిరోధక శాఖ (ACB) మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం నాడు ఏసీబీ తనిఖీల్లో నరహరి ఇంట్లో భారీగా నగదు, బంగారం, ఆస్తులు గుర్తించారు.

సర్వే,ల్యాండ్ రికార్డ్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు అక్రమాస్తులివే..

ఏసీబీ దాడుల్లో వెలుగులోకి వచ్చిన ఆస్తులు

స్థిరాస్తులు:

1. రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ప్లాట్లు

2. మహేశ్వరం వద్ద 1.24 ఎకరాల వ్యవసాయ భూమి

3. పుప్పాలగూడలో 2,500 చ.అ. ఫ్లాట్

4. నార్సింగిలో 1,860 చ.అ. చొప్పున 2 ఫ్లాట్లు

5. రాజేంద్రనగర్‌లో 1,377 చ.అ. ఫ్లాట్

6. గచ్చిబౌలిలో G+3 భవనం

7. ఛత్రినాకలో G+2 భవనం

నగదు ,పెట్టుబడులు 

1.నగదు : రూ.1.54 కోట్లు

2.బ్యాంక్ నిల్వలు : రూ.2.29 కోట్లు

3.ఫిక్స్‌డ్ డిపాజిట్లు : రూ.5.04 కోట్లు

విలువైన వస్తువులు

1. బంగారం : 1.3 కిలోలు

2. వెండి : 8 కిలోలు

 KIA Carens Smartstream G1.5 6MT కారు

మొత్తం గుర్తించిన ఆస్తుల విలువ = రూ.13.05 కోట్లు

మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. సుంకరి నరహరిరావు అదనపు ఆస్తులపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.