బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం
బెజ్జూర్ జూన్ 17 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా నిర్వాహకులు జనగామ లక్ష్మణ్, బొజ్జ కళావతి యోగ చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. యోగా చేయడంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని బిపి,షుగర్, రక్తపోటు, ఊపిరితిత్తుల సమస్యలు, టెన్షన్ నుండి ప్రశాంతత లభిస్తుంది. బిపి,షుగర్ అదుపులో ఉంటుంది. కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, నరాల బలహీనత తదితర సమస్యలు సైతం కుదిరితపడతాయని తెలిపారు. ప్రతిరోజు ఆయుష్మాన్ భారత్ యోగ కేంద్రంలో ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు యోగ నిర్వహించడం జరుగుతుందని యోగ శిబిరాన్ని ఆసక్తి గలవారు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. యోగ కేంద్రంలో ఉచితంగా యోగ పై శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.






