calender_icon.png 15 February, 2026 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ కూడా ఆశించిన మేర రాలే

14-02-2026 04:11:02 PM

హైదరాబాద్: ఎక్స్ అఫీషియా ఓట్ల నమోదు(Registration of ex officio votes)పై సీఎస్ ఎస్ఈసీతో మాట్టాడామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.  30 పైగా మున్సిపాలిటీలు గెలుస్తామని అనుకున్నాం.. కొంత తగ్గిందని, హింగ్ వచ్చిన చోట కూడా మాకు అనుకూలంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించిన మేర మున్సిపాలిటీలు రాలేదని, కరీంనగర్, నిజామాబాద్ మినహాయిస్తే బీజేపీ ప్రభావం ఎక్కడా లేదని ఆయన తెలిపారు.

స్థానికంగా జరిగిన ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టే పొత్తులు ఉంటాయని, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఫలితాలే ఇందుకు స్పష్టమైన ఉదాహరణ అన్నారు. పార్ములా-ఈ కేసులో ఏమీ లేదని ఏసీబీ అధికారులే చెబుతున్నారని, ఫార్ములా-ఈ, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ఐదుసార్లు విచారణకు పిలిచారని కేటీఆర్ చెప్పారు. సింగరేణి కార్మికులకు సందేశం ఇవ్వాలన్న ఆలోచనతోనే కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇచ్చారన్నారు.