17 April, 2026 | 10:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

సాధారణ స్థితికి కోల్‌కతా.. అనేక ప్రాంతాలు జలమయం

24-09-2025 10:13 AM

కోల్‌కతా: కోల్‌కతాను వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు(heavy rainfall) జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్ షాక్ తో పలు మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఎందరో ప్రజలు నిరాశ్రులయ్యారు. బుధవారం నాడు కోల్‌కతా(Kolkata ) సాధారణ స్థితికి తిరిగి వచ్చింది. ఇందుకు ఘోరంగా శ్రమించాల్సి వచ్చింది. ముఖ్యంగా సాల్ట్ లేక్, నగరంలోని ఉత్తర, మధ్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. కుండపోత వర్షం కారణంగా 10 మంది మరణించారని అధికారులు వెల్లడించారు.

మహానగరంలో జనజీవనం స్తంభించిపోయింది. రాబోయే 24 గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. అయితే కొన్ని చోట్ల ఉరుములు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు జల్లులు పడతాయని, అయితే ఆకాశం మేఘావృతమై ఉంటుందని అంచనా వేసింది. కోల్‌కతా దాని పరిసర ప్రాంతాలలోని లోతట్టు ప్రాంతాల నుండి అధికారులు రాత్రంతా శ్రమించి నీటిని తోడేశారు. కానీ బిధాన్‌నగర్ నివాసితులు వరదల్లో చిక్కుకున్నారు. భారీ వర్షాల కారణంగా వాహనాలు తక్కువ వేగంగా కదులుతున్నాయి.