నన్ను టీ20 ప్లేయర్‌లా చూడలేదు
టెస్ట్ ప్లేయర్‌గా ముద్ర వేశారు
కేఎల్ రాహుల్ వ్యాఖ్యలు
ఢిల్లీ, మే 5: ఢిల్లీ క్యాపిటల్స్ వి కెట్ కీపర్ కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశా డు. బీసీసీఐ సెలక్షన్ కమిటీపై పరో క్షంగా విమర్శలు గుప్పించాడు. తనను టీ20 క్రికెటర్‌లా ఎప్పు డూ చూడకపోవడం బాధ కలిగించిందన్నాడు. టీ20 క్రికెట్‌లో తనకు పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండేవి కావని తెలిపాడు. తనను టీ20 క్రికెట్లో ఎప్పుడూ ఆటగాడిగా పరిగణించలేదని, కేవలం ఒక టెస్టు ప్లేయర్‌గానే తనపై ముద్ర వేశారం టూ ఆసక్తికర వ్యాఖ్య లు చేశాడు. జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కేఎల్ రా హుల్ మాట్లాడాడు.
పదేళ్ల క్రితం టీ20 జ ట్టులో భాగం కావడానికి ఎంతో ప్రయత్నించాననీ, కానీ తనను ఎప్పుడూ ఒక టీ20 ఆటగాడిగా పరిగణించలేదన్నాడు. కనీసం ఒక మంచి వైట్‌బాల్ ఆటగాడిగా కూడా చూ డలేదన్నాడు. కేవలం ఒక టెస్టు ప్లేయర్‌గానే తనపై ముద్రను వేశారనీ రా హుల్ వ్యాఖ్యానించాడు. అయితే ఐపీఎల్ ద్వారా టెస్టు ప్లేయర్ అనే ముద్ర నుంచి బయటపడ్డానని తెలిపాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో ఆటను మరిం త మెరు గుపరుచుకొని ఇవాళ ఈ స్థాయికి చేరడం గర్వంగా ఉందన్నాడు.






