6 May, 2026 | 2:38 AM

పంజాబ్‌పై సన్‌రైజ్ అయ్యేనా?

06-05-2026 12:00 AM

ఉప్పల్ స్టేడియంలో బిగ్ ఫైట్

పరుగుల వరద ఖాయం

హైదరాబాద్, మే 5: ఐపీఎల్ 19వ సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో తలపడబోతోంది. వరుసగా ఐదు విజయాల తర్వాత గత మ్యాచ్‌లో అనూహ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యం లో బ్యాటర్లు, బౌలర్లు మునుపటి ఫామ్‌తో చెలరేగాల్సిన పరిస్థితి వచ్చింది.

హోంగ్రౌండ్ కావడంతో సహజంగానే అడ్వాంటేజ్ ఉం టుంది. గత మ్యాచ్ తప్పిదం రిపీట్ కాకుం డా భారీస్కోరు చేయకుంటే పంజాబ్ కింగ్స్ చేతిలోనూ ఓటమి తప్పదు. గత మ్యాచ్‌లో అనారోగ్యం కారణంగా ఆడలేకపోయిన నితీ ష్ కుమార్ రెడ్డి పంజాబ్ కింగ్స్‌పై బరిలోకి దిగనున్నాడు. మరోవైపు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ గ త రెండు మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ చేతి లో వరుస ఓటములతో డీలాపడిన ఆ జట్టు సన్‌రైజర్స్ ను ఓడించి మళ్లీ గెలుపు బాట పట్టాలని భావిస్తోంది.

ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కన్నోలీ, శ్రేయాస్ అ య్యర్, స్టోయినిస్ వంటి స్టార్స్‌తో పంజాబ్ బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా ఉంది. అయితే హోంగ్రౌండ్‌లో బౌలింగ్ పరంగానూ ఆకట్టుకుంటున్న సన్ రైజర్స్‌ను ఈ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. అటు బౌలింగ్‌లో మార్కో జెన్సన్, బార్ట్ లెట్, అర్షదీప్ సింగ్ పేస్ ఎటాక్ లో కీలకంగా ఉన్నారు. స్పిన్ విభాగం చాహల్ పైనే భారం పడనుంది. గత రికార్డులను చూస్తే సన్‌రైజర్స్ దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 25 సార్లు తలపడితే 17 మ్యాచ్ లలో సన్‌రైజర్స్ గెలవగా, 8 మ్యాచ్‌లలో పంజాబ్ విజ యం సాధించింది. ఇక ఉప్పల్ స్టేడియంలో మరోసారి పరుగుల వరద పారనుంది.

తుది జట్లు అంచనా

సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీశ్ రెడ్డి, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, కమిన్స్(కెప్టె న్), శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, సాకిబ్ హొస్సేన్

పంజాబ్ కింగ్స్ : ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), స్టోయినిస్, సూర్యాన్ష్, నేహల్ వధేరా, మార్కో జెన్సన్, బార్ట్‌లెట్, అర్షదీప్ సింగ్, చాహల్