14 July, 2026 | 5:01 PM

Breaking News

ఆరోగ్య సంరక్షణకు అధునాతన ఆవిష్కరణలు   •   అబాకస్ పోటీల్లో రాష్ట్ర స్థాయి విజేతలుగా బ్లూ బెల్స్ విద్యార్థులు   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కేరళ మోడల్ హై స్కూల్ విద్యార్థులు   •   20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •  

మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక

02-05-2026 06:46 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ లీగల్ అవేర్నెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ కు చెందిన కేకే చారి మానవ హక్కుల సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కేకే చారి మాట్లాడుతూ పేద ప్రజలకు గరీబోళ్లకు ఈ పదవి ద్వారా మరింత సహకారం, సేవలు అందిస్తానని తెలిపారు. అనంతరం శనివారం బాధ్యతలు స్వీకరించారు. మల్కాజ్గిరి డివిజన్ ఏసిపి చక్రపాణి సిఐ ఆంజనేయులు చేతుల మీదుగా ఆయన ఈ నియామక పత్రాన్ని అందుకున్నారు. మానవహక్కుల పరిరక్షణతో పాటు ప్రజలకు చట్టపరమైన అవగాహన కల్పించేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ డి. కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.