ఇసక తిన్నెల్లో యష్‌తో కియారా రొమాన్స్!
పాన్ ఇండియా స్టార్ నటుడు యశ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’ నుంచి తాజాగా విడుదలైన పోస్టర్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సినిమాలో యష్ రాయ అనే పాత్రలో నటిస్తుండగా, కియారా నాదియా పాత్రలో అలరించనుంది. వీరే కాకుండా నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా మరియు రుక్మిణి వసంత్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం 194070ల మధ్య గోవా బ్యాక్డ్రాప్లో సాగే గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్నట్లు సమాచారం. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని మొదటి పాట ‘తబాహి’కి సంబంధించి మేకర్స్ విడుదల చేసిన రొమాంటిక్ అప్డేట్స్ ఇప్పుడు ఫ్యాన్స్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘తబాహి’ని మార్చి 2న సోమవారం (నేడు) విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో యశ్ షర్ట్లెస్ లుక్లో కనిపిస్తుండగా, కియారా అద్వానీ ఆయనను బిగి కౌగిలిలో బంధించిన రొమాంటిక్ స్టిల్ ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. సముద్రపు తీరంలో సూర్యాస్తమయ వేళ వీరిద్దరి కెమిస్ట్రీ పోస్టర్లలో పీక్స్లో కనిపిస్తోంది.




