20 May, 2026 | 3:54 PM

Breaking News

మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన నాయకులు   •   ఉత్పత్తి లక్ష్యాల సాధనే ధ్యేయంగా పునరంకితమవ్వాలి   •   సింగరేణిని కాపాడుకోవడమే తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య ఏకైక లక్ష్యం   •   మైనర్ బాలికను మభ్యపెట్టి వివాహం చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్   •   నవోదయ ఫలితాల్లో బ్లూమింగ్ మైండ్స్ విద్యార్థుల ప్రతిభ   •   ఆన్‌లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలి   •   మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి కిషన్ రెడ్డి భేటీ.. పట్టణాభివృద్ధిపై చర్చ   •   సుప్రీంకోర్టు సీరియస్.. కులగణ పిటిషన్‌ కొట్టివేత   •   దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్   •   కొనసాగుతున్న ఎల్లయ్య చెరువు కాలువల పూడికతీతల పనులు   •  

కేసీఆర్ ఆలోచన ఫలితం కల్యాణలక్ష్మి

15-01-2026 01:56 AM

జైనూర్, జనవరి 14 (విజయక్రాంతి): పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కానుకగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టడం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనేనని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో సిర్పూర్ (యు), జైనూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని, కానీ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.

పేదింటి ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామని  తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, జైనూర్ సర్పంచ్ కడప ప్రకాశ్, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంతియాజ్ లాలా, ఉపాధ్యక్షుడు ఆత్రం శంకర్, నాయకులు జాధవ్ శ్రవణ్, సతీష్, కేంద్ర విశాల్ పాల్గొన్నారు.