3 March, 2026 | 5:18 PM

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ హోలీ శుభాకాంక్షలు

03-03-2026 03:07 PM

హైదరాబాద్: ప్రజల్లో హోలీ కొత్త ఆశలు, విశ్వాసాలు నింపాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) అధినేత,  తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) రాష్ట్ర ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు(KCR Holi wishes) తెలిపారు. ప్రజలందరి నడుమ ప్రేమాభిమానాలను విరజిమ్మే రంగుల పండుగగా, హోలీ పండుగ భారతీయ సంప్రదాయంలో ప్రత్యేకతను సంతరించుకుందని పేర్కొన్నారు.

ఆకులు రాలే శిశిరం నుంచి కొత్త చిగురులు తొడిగే వసంతానికి బాటలు వేస్తూ, ప్రకృతిలో నూతనత్వానికి సూచకంగా హోలీనిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. ఆశలు అడుగంటి ఉన్న తెలంగాణ ప్రజల్లో, కొత్త ఆశలు విశ్వాసాలు తిరిగి పుంజుకోవాలని, ప్రజల నడుమ మరింతగా సహోదరత్వం పెంపొందాలని హోలీ సందర్భంగా కేసీఆర్ ఆకాంక్షించారు.