27 July, 2026 | 1:07 AM

భక్తిశ్రద్ధలతో కట్ట మైసమ్మ ఉత్సవాలు

27-07-2026 12:06 AM
  1. చల్లగా చూడు తల్లి...నాయీ బ్రాహ్మణ కుటుంబాల ప్రత్యేక పూజలు
  2.  రైతాంగ సంక్షేమం కోసం ప్రార్థనలు

మంథని, జూలై 26 (విజయ క్రాంతి)పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని నాయి బ్రాహ్మణవాడలో కొలువై ఉన్న కట్ట మైసమ్మ తల్లి ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిం చారు. నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించారు.ఈ సందర్భంగా భక్తు లు కొబ్బరికాయలు కొట్టి, నైవేద్యాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

చల్లగా చూ డు మైసమ్మ తల్లి అంటూ అమ్మవారిని వేడుకుంటూ కుటుంబ సభ్యులందరూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు.

పూజల సందర్భంగా కొందరు భక్తులపై కట్ట మైసమ్మ తల్లి పూనకం రావడంతో ఆలయ ప్రాం గణం భక్తి పారవశ్యంతో నిండిపోయింది. పూనకంలో ఉన్న భక్తులు అమ్మవారి మహిమను చాటుతూ ఆశీర్వచనాలు అందించగా, అక్కడున్న భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ ఉత్సవాల్లో నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు, మహిళలు, యువత, చిన్నారులు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా నాయి బ్రాహ్మణవాడలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.