20-02-2026 01:08:30 AM
కాన్‌బెర్రా, ఫిబ్రవరి 19 : ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ప్రారంభించిన భార త మహిళల జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైం ది. మూడు టీ20 ల సిరీస్‌లో భాగం గా కాన్‌బెర్రా వేదికగా గురువారం జరిగిన రెం డో మ్యాచ్‌వో సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా 19 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. బౌలింగ్‌లో రాణించిన భారత్ బ్యాటింగ్‌లో చేతులెత్తే సింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జియో వోల్ 57 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 88, బెత్ మూనీ 39 బంతుల్లో 4 ఫోర్లతో 46 టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి రెండు వికెట్లు తీయగా.. రేణుకా సింగ్ ఒక వికెట్ తీసింది. అనంతరం భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులే చేసి ఓటమిపాలైంది.
కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 30 బంతుల్లో 5 ఫోర్లతో 36, స్మృతి మంధాన 24 బంతుల్లో 4 ఫోర్లతో 31 మాత్రమే రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అష్లే గార్డ్నర్ మూడు వికెట్లు తీయగా.. కిమ్ గార్త్, అన్నబెల్ సదర్లాండ్, సోఫీ మోలినక్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ 1- సమమైంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 శనివారం జరుగుతుంది.
చరిత్ర సృష్టించిన హర్మన్ ప్రీత్ కౌర్
టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్ హర్మన్ ప్రీత్ కౌర్ కెరీర్‌లో 356వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ క్రమంలో ఆమె న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్‌ను అధిగమించింది. న్యూజిలాండ్ తరఫున సుజీ బేట్స్ 355 మ్యాచ్‌లు ఆడింది. ఎల్లిస్ పెర్రీ 349, మిథాలీ రాజ్ 333, చార్లోట్ ఎడ్వరడ్స్ 309 మ్యాచ్‌లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఈ జాబితాలో హర్మన్ ప్రీత్ కౌర్, ఎల్లిస్ పెర్రీ, సుజీ బేట్స్ మాత్రమే అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నారు. మిగతా ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇదిలా ఉంటే హర్మన్‌కు ఇది 189వ టీ20 మ్యాచ్. 2009లో అరంగేట్రం చేసిన హర్మన్ ప్రీత్ కౌర్ 29.33 సగటుతో 3784 పరుగులు చేసింది. 2009 వన్డే ప్రపంచకప్‌తో 50 ఓవర్ల ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన హర్మన్.. 161 మ్యాచ్‌లలో 7 సెంచరీలతో 4409 పరుగులు చేసింది. 2014 నుంచి ఇప్పటి వరకు 6 టెస్టులు ఆడింది.