కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌తో సీఎం రేవంత్ భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy) బుధవారం ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను(Union Forest Minister Bhupender Yadav) కలిశారు. ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులు, అటవీ సంరక్షణ, అలాగే కేంద్ర ప్రభుత్వ ఆమోదం అవసరమైన పలు ప్రజా మౌలిక సదుపాయాలు,అభివృద్ధి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఢిల్లీలోని శ్రమ్ శక్తి భవన్‌లో ఉన్న కార్యాలయంలో, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌తో కూడా రేవంత్ రెడ్డి సమావేశమవుతారు.






