5 May, 2026 | 6:58 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

కాగజ్ నగర్‌లో 2 కె రన్ నిర్వహణ

09-03-2026 03:28 PM

కాగజ్‌నగర్,(విజయక్రాంతి): ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కాగజ్‌నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం 2K రన్ నిర్వహించారు. ఈ రన్ తెలంగాణ చౌరస్తా నుండి ప్రారంభమై రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు కొనసాగింది. గాంధీ పార్క్‌లో ఉన్న చెత్తను వినియోగించి కంపోస్ట్ తయారీ విధానాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ ,చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ షహీన్ సుల్తానా, వైస్ చైర్‌పర్సన్ డా. కొత్తపల్లి అనిత, మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, కౌన్సిలర్లు ఎమ్మాజీ శారద, కచ్చకాయల జ్యోతి, కావేటి విజయ్ కుమార్, వాసిమున్నిస, పెండోర్ మాణిక్యారావు, ఆర్‌పీలు, ఎస్‌హెచ్‌జీ మహిళలు, మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రజలు  పాల్గొన్నారు.