10 March, 2026 | 3:44 PM

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతం చేసేందుకే 5కే రన్

09-03-2026 03:33 PM

మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల  శ్రీనివాస్

మంథని,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతం చేసేందుకే 5కే రన్ నిర్వహిస్తున్నట్లు మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల  శ్రీనివాస్ తెలిపారు.  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమములో భాగంగా సోమవారం మున్సిపల్ చైర్మన్  ఒడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యములో వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి,  మున్సిపల్ కమిషనర్ మనోహర్, కౌన్సిలర్స్ తో పాటు అధికారులు మంథని పట్టణ ప్రజలతో  పాత పెట్రోల్ బంక్ నుంచి బస్ డిపో వరకు 5K రన్ నిర్వహించారు.

అనంతరం 2వ వార్డు లోని ఎరుకల గూడెంలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించి, మురుగు కాలువలు శుభ్రం చేయించి, ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమములో  వార్డు  కౌన్సిలర్స్ కుర్ర లింగయ్య, నూకల కమల్, ఎరుకల స్రవంతి, జంబోజు శ్రీమతి, మారుపాక నిహారిక, పెంటరి రాజు, ఎల్లెంకి వంశీధర్, మెప్మా సీఈఓ లావణ్య, మెప్మా ఆర్.పి లు మున్సిపల్ సిబ్బంది,   ప్రజలు పాల్గొన్నారు.