09-02-2026 12:08:39 AM
జహీరాబాద్, ఫిబ్రవరి 8 :మున్సిపల్ ఎ న్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్‌ఎస్ పార్టీలోకి పలువురు నాయకులు చేరారు. 20వ వార్డు అల్లిపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య కార్యకర్తలు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలోకి చేరారు. ఎ వారికి గులాబి కండువాల ను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అల్లిపూర్ గ్రామానికి చెందిన బసవ రాజ్ పాటిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం వల్లే తాము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్‌ఎస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జి ల్లా డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జ్ దేవి ప్రసాద్, పార్టీ నాయకులు గుండప్ప విజయకుమార్, అల్లిపూర్ గ్రామానికి చెందిన అం జా సంగారెడ్డి, నరసింహారెడ్డి, ప్రభాకర్, శంక ర్ పటేల్, తిరుపతిరెడ్డి, మోహన్, అప్సర్, శ్రీ కాంత్, రాజు బాబు, ఆనంద్, గడ్డం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.