21 April, 2026 | 4:31 AM

జీవన్ రెడ్డిది.. ఐరన్ లెగ్!

21-04-2026 02:58 AM
  1. భావిస్తున్న బీఆర్‌ఎస్ శ్రేణులు
  2. ఆయన రాకను వ్యతిరేకిస్తున్న హరీశ్‌రావు
  3. పార్టీలో చీలిక వస్తుందని కార్యకర్తల్లో చర్చ
  4. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్

జగిత్యాల, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): కేసీఆర్ సభకు వెళ్లకుండా హరీశ్‌రావు ఢిల్లీకి వెళ్లాడని.. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న సభకు సీనియర్ నేత రాకపోవటం, జీవన్ రెడ్డి చేరిక పైన హరీశ్‌రావుకి అసంతృప్తి ఉన్నట్లు ఉందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు.జీవన్‌రెడ్డి చేరికను మొదటి నుంచి హరీశ్ వ్యతిరేకిస్తున్నారని, ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించడానికి కూడా ఇష్టపడలేదని అన్నారు. సోమవారం నాడిక్కడ జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడారు.

నేడు జీవన్ రెడ్డి చేరిక సమయంలో జగిత్యాల రాకుండా హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లారు.. జీవన్ రెడ్డి ది ఐరన్ లెగ్ గా బీఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నారని అన్నారు. జీవన్ రెడ్డి కారణంగా బీఆర్‌ఎస్‌లో చీలిక వచ్చే ఛాన్స్ ఉందని అప్పుడే పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైందన్నారు.జీవన్ రెడ్డి చేరిక నచ్చని కొందరు బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జీవన్ రెడ్డి ఫ్లెక్సీలు తొలగించారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని హరీశ్‌రావుకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారన్నారు.

బీఆర్‌ఎస్ లోనే ఉండి జీవన్ రెడ్డి చేరికపై మనం పోరాడుదామని హరీశ్‌రావుకు స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి లాంటి ఐరన్ లెగ్‌ను పార్టీలో ఉండే ఎదుర్కొందామంటున్న ఎమ్మెల్యేలు పార్టీని కాపాడుకుందామని హితవు పలికారు.జీవన్‌రెడ్డి వల్ల ఎన్‌టీఆర్,తక్కువ వ్యవధిలో నాదెండ్ల భాస్కర్ పదవి కోల్పోయారు.2009 లో రెండవ సారి కాంగ్రెస్ అధికారం లోకి వచ్చినా వైఎస్‌ఆర్ స్వర్గస్థులు అయ్యారు. జగిత్యాల బీఆర్ ఎస్ శ్రేణులు జీవన్ రెడ్డిని ఐరన్ లెగ్‌గా భావిస్తున్నారన్నారు.

రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచా, నాకు ఇరిగేషన్ పై పూర్తి అవగాహన ఉందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు.మేడిగడ్డ సభలో ముఖ్యమంత్రి ఇరిగేషన్ అభివృద్ధి పనులపై స్పష్టమైన ఆదేశాలు హామీలు ఇస్తారని భావిస్తున్న.. జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి తో కలిసి పనిచేస్తున్నా..

రాష్ట్ర స్తాయి రాజకీయాల్లో, జీవన్ రెడ్డి పార్టీ వీడడంలో నా జోక్యం ఎప్పుడు లేదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్  స్పష్టం చేశారు.గతంలో జీవన్ రెడ్డి రేవంత్ కావాలి కేసీఆర్ పోవాలి అన్నారు. ఒక మాసం నుంచి రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలి అని అంటున్నారు.ఇవి పూర్తిగా ప్యాకేజీ మాటలు.. ఇలాంటి మాటలు సీనియర్ రాజకీయం అనుభవం ఉండి మాట్లాడటం విడ్డూరంగా ఉంది అన్నారు.