జమ్మూకశ్మీర్ సరికొత్త చరిత్ర
తొలిసారి రంజీ ట్రోఫీ కైవసం
ఫైనల్లోనూ అదరగొట్టిన ఆకీబ్ నబీ
హుబ్లీ, ఫిబ్రవరి, 28 : భారత దేశవాళీ క్రికెట్‌లో సరికొత్త శకం మొదలైంది. డొమెస్టిక్ క్రికెట్‌లో ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ అనగానే ముంబై, కర్ణాటక, బెంగాల్, ఢిల్లీ వంటి జట్లే టైటిల్ ఫేవరెట్లుగా కనిపిస్తుంటాయి. ఇదంతా మొన్నటి వరకూ మాత్రమే.. ఇప్పుడు కథ మారింది.
ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి నిలకడగా రాణిస్తూ, పెద్ద జట్లకు షాకిస్తూ తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్ కైవసం చేసుకున్న జట్టుగా జమ్ము కశ్మీర్ చరిత్ర సృష్టించింది. గత కొంతకాలంగా జమ్మూ కశ్మీర్ జట్టు రంజీల్లోనే కాదు దేశవాళీ క్రికెట్‌లో పలు అద్భుత విజయాలు సాధిస్తోంది. దీనిలో భాగంగానే రంజీ సీజన్ లోనూ అదరగొట్టింది. పెద్ద పెద్ద జట్లను నిలువరిస్తూ ఫైన ల్‌కు దూసుకొచ్చిన జమ్మూ కశ్మీర్ తమ విజయాలు గాలివాటం కాదని నిరూపించింది.
ఫైనల్లో టైటిల్ ఫేవరెట్ కర్ణాటకపై పూర్తి ఆధిపత్యం కనబరిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జమ్మూ కశ్మీర్ భారీ స్కోరే లక్ష్యంగా ఆడింది. కీలక బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. కెప్టెన్ పారస్ డోగ్రా, యావర్ హసన్, అబ్దుల్ సమద్, కన్హయ్య వాధవాన్, సాహిల్‌లో ట్రాహాఫ్ సెంచరీలతో రా ణించారు. ఇక శుభం పండిర్ సెంచరీతో చెలరేగ డంతో భారీస్కోరు చేయగలిగింది. టాప్ క్లాస్ బ్యాటర్లున్న కర్ణాటకను 293 పరుగులకే ఆలౌట్ చేసింది. సీనియర్ ఓపెనర్ మ యాంక్ అగర్కాల్ భారీ శతకంతో రాణించినా మిగిలిన వారి నుంచి సహకారం లభించలేదు.
జమ్మూకశ్మీర్ విజయంలో ఆకిబ్ నబీ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో కర్ణాటకను దెబ్బకొట్టాడు. 291 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధి క్యం సాధించి రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన జమ్మూ నాలుగోరోజు ముగిసేసరికే 477 పరుగులకు ఆధిక్యాన్ని పెంచుకుంది. రంజీ నిబంధనల ప్రకారం మ్యాచ్ ఫలితం తేలకుంటే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. దీంతో తొలిసారి రంజీ ట్రోఫీ ఛాంపియన్ గా నిలిచింది. ఈ మ్యాచ్ చివరిరోజు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా హాజరై విజేతగా నిలిచిన తమ జట్టును అభినందించారు.




