జలేందర్ రావు కృషి, నిబద్ధత అభినందనీయం
ఆర్డీఓ వేణుమాధవరావు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఏప్రిల్ 30: రెవెన్యూ శాఖలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసి ప్రజలకు సేవలు అందించిన గిర్ధవార్ జలంధర్ రావు సేవలు అభినందనీయమని ఆర్డీఓ వేణుమాధవ్ రావు అన్నారు. గురువారం మండల కేంద్రం అర్వపల్లిలోని శ్రీరా మ ఫంక్షన్ హాల్ లో రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా,గిర్ధవార్గా పనిచేసి పదవీ విరమణ పొందిన రామరాజు జలంధర్ రావు ఉద్యోగ విరమణ,ఆత్మీయ వీడ్కోలు, సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జలేందర్ రావు-మంజుల దంపతుల ను ఘనంగా సన్మానించి ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్,ఎస్ ఐ ఈట సైదులు, డీటీ అశ్విని,సర్పంచులు చిల్లంచర్ల విద్యాసాగర్,బింగి కృష్ణమూర్తి,పాశం కరుణాభాస్కర్ రెడ్డి,ప్రధానోపాధ్యాయులు ఉల్లెందుల సైదు లు, గిర్ధవార్ పాటి వెంకట్ రెడ్డి,వివిధ పార్టీల నాయకులు,అభిమానులు,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






