ఎటువంటి భయాందోళనలు చెందకుండా పరీక్షలు రాయండి
పదవ తరగతి విద్యార్థులను కోరిన ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం,(విజయక్రాంతి): పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిలు మనసులో ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకుండా పరీక్షలు బాగా రాసి అత్యుత్తమ గ్రేడ్ లో పాస్ కావాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. శుక్రవారం సాయంత్రం భద్రాచలం పట్టణంలోని గురుకుల సిఓఈ కళాశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిలకు ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేసిన పరీక్షా కిట్లను, హాల్ టికెట్లను 74 మంది విద్యార్థులకు అందించారు.
ఈ సందర్భంగా విద్యార్థినిలకు పలు సూచనలు ఇస్తూ పదవ తరగతి పరీక్షలు అనేటివి మీ ఉజ్వల భవిష్యత్తును అభివృద్ధిలోకి తీసుకువచ్చేదని అందుకు విద్యార్థినిలు అన్ని ప్రశ్నలకు సమాధానాలు అర్థమయ్యే రీతిలో రాయాలని మనసులో ఎటువంటి భయాందోళనలు సందేహాలు పెట్టుకోవద్దని అన్నారు.
ఈ పరీక్షల్లో వచ్చిన గ్రేడ్ల ఆధారంగా పై చదువులు చదవడానికి ఎంతో ఉపయోగపడతాయని అందుకు విద్యార్థినిలు పరీక్షలు బాగా రాసి అత్యుత్తమ మార్కులతో పాసై మీ తల్లిదండ్రులకు మరియు మీ గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకోవచ్చు మీరు చదువుకున్న పాఠశాల కూడా మంచి పేరు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గురుకులం ఆర్సిఓ అరుణకుమారి, కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి మరియు అధ్యాపకులు ఫ్యాకల్టీలు విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.




