31 July, 2026 | 9:57 PM

పోల్కంప‌ల్లి పౌర‌హ‌క్కుల‌పై అవ‌గాహ‌న

31-07-2026 08:41 PM

మునిప‌ల్లి,(విజ‌య‌క్రాంతి): మండ‌ల ప‌రిధిలోని పోల్కంప‌ల్లి గ్రామంలో శుక్ర‌వారం పౌర‌హ‌క్కుల దినోత్స‌వాన్ని గ్రామ  స‌ర్పంచ్ వీరేశం అధ్య‌క్ష‌త‌న  నిర్వ‌హించి గ్రామ‌స్తుల‌కు  మునిప‌ల్లి ఎస్ఐ అర‌వింద్, డిప్యూటీ త‌హ‌సీల్దార్ ప్ర‌దీప్ లు   అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ సంద‌ర్భంగా  వారు  మాట్లాడుతూ... అసమానతలు లేని సమాజం కోసం ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.  అలాగే రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. హక్కులకు ఎలాంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో    గ్రామ‌స్తులు  త‌దిత‌రులు పాల్గొన్నారు.