11 July, 2026 | 1:49 PM

Breaking News

రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక   •   రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన   •   దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం   •   ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన ధరణి కంప్యూటర్ ఆపరేటర్   •   రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ కృతజ్ఞతలు   •   ప్రభుత్వ పాఠశాల గోడ పక్కనే రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన..!   •   డంపింగ్ యార్డ్ తరలింపు వ్యతిరేక ఉద్యమాన్ని ఆపలేరు: ఎంపీ ఈటెల రాజేందర్   •   గొడుగులు పంపిణీ చేసిన ఎడెల్లి శ్రీనివాస రెడ్డి   •   కడ్పల్ లో పాము కాటుకు రైతు మృతి   •  

బాంబులతో ఇరాన్ ఛిన్నాభిన్నం

11-07-2026 02:12 AM

మునుపెన్నడూ లేని విధంగా దాడి చేస్తాం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్, జూలై 10 : బాంబుల వర్షంతో ఇరాన్ ఛిన్నాభిన్నం కానుందని, ఆ దేశంపై మునుపెన్నడూ దాడులు చేయ మని తమ సైన్యానికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తనను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నుతోందని, ఇకపై ఉపేక్షించేది లేద ని హెచ్చరించారు. శుక్రవారం రాత్రి ఆయన ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

తన జోలికి రావాలని చూస్తే, ఇరాన్‌కు నరకమంటే ఎంటో చూపిస్తానని ప్రతిన బూనారు. ఇరాన్ హిట్ లిస్ట్‌లో మొదటి స్థానంలో తానే ఉన్నానని చెప్పుకొచ్చారు. ఆ దేశ నాయకత్వం తనను చంపాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోందని, తనను తుదముట్టించేందుకు తాజాగా కుట్ర పన్నినట్లు ఆరోపించారు. తన హత్యపై ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిందనే వార్తలను ఆయన తోసిపుచ్చారు.