13 May, 2026 | 2:20 AM

నర్సుల సేవలు వెలకట్టలేనివి

13-05-2026 12:05 AM

డాక్టర్ అన్నపూర్ణ

గజ్వేల్ జిల్లా ఆసుపత్రిలో ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

గజ్వేల్, మే 12: గజ్వేల్‌లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మంగళవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో నర్సుల సేవలు వెలకట్టలేనివన్నారు.

ఒక అమ్మగా, అక్కగా, చెల్లిగా రోగులకు అండగా నిలుస్తూ రేయింబవళ్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిస్వార్థంగా సేవలు అందిం చడం అభినందనీయమన్నారు. అనంతరం ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి నర్సుల దినోత్సవ వేడుకలను  నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు డాక్టర్ కుమార్ స్వామి,  మాతా శిశు సంరక్షణ కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ సుశీల రత్నం, ఆర్‌ఎంఓలు డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రణీత, డాక్టర్ త్రివేణి, డాక్టర్ సుమన్, నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణ, హెడ్ నర్సులు ఉమా, రోజులిన్, ఉమామహేశ్వరి, వకుళాదేవి, నిర్మల, పుష్ప, నర్సింగ్ ఆఫీసర్లు షబానా, సప్న, షాహిని, కవిత, ఉజ్మా, రేఖ, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ ఆఫీసర్ మెహరాజ్ భాను, రజిత, పుష్ప జగదాంబ, నజీర్, సానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్లు రచన, జీవన, ఎక్స్రే టెక్నీషియన్లు అయేషా, మమత, ఈసీజీ టెక్నీషియన్ రాజు, ఆరోగ్యశ్రీ సిబ్బంది సురేందర్, సంతోష్తో పాటు పారామెడికల్, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.