15 August, 2026 | 4:31 AM

ఇంటర్ అడ్మిషన్ల గడువు 31 వరకు పొడిగింపు

15-08-2026 01:15 AM
  1. నేటితో గడువు ముగుస్తుండటంతో మరోసారి పెంపు
  2. బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్

హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాల గడువును మరోసారి ఇంటర్ బోర్డు పొడిగించింది. గతంలో ఈ నెల15 వరకు పొడిగించిన గడువు ముగియడంతో ఈ నెల 31 వరకు మరోసారి పెంచుతూ నిర్ణ యం తీసుకున్నట్టు ఇంటర్ బోర్డు శుక్రవా రం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ విద్యా సం వత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకులాలు, మోడల్ స్కూ ల్స్ ఇలా అన్ని రకాల జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లకు ఈ గడువు వర్తిస్తుందని బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశా న్ని ఉపయోగించుకోవాలని, గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకుని అడ్మిషన్లు పొందాలని సూచించారు.