2 August, 2026 | 3:28 AM

చొరబాటుదారుల తిరుగుబాట

02-08-2026 12:30 AM
  1. స్పెయిన్ నుంచి తిరిగి మొరాకోకు వలసదారులు
  2. సెటాలో దుర్భర పరిస్థితులు

మ్యాడ్రిడ్, ఆగస్టు 1: యూరప్ తమ కలల ప్రపంచమని, చచ్చీ చెడి స్పెయిన్ చేరుకుంటే చాలు.. ఇక తమ జీవితాలు మారతాయని ఆశపడిన మొరాకో వలసదారులకు నిరాశే ఎదురైంది. సముద్ర జలాలను ఈదుకుం టూ, సైన్యం కళ్లు గప్పి స్పెయిన్‌లోని సెటా పట్టణానికి చేరుకున్న వలసదారులు ఆకలి, అలసటతో అలమటిస్తున్నారు. సెటా పట్టణవాసులను వారిని శత్రువుల్లా చూడటం వా రిని కలచివేస్తున్నది.

అన్నపానాదులు లభించకపోవడం విలవిలలాడేలా చేసింది. మాన వ అక్రమ రవాణా ముఠాలు అరచేతిలో వై కుంఠం చూపించగానే, ఆశపడి, వ్యయప్రయాసలకోర్చి స్పెయిన్ చేరుకున్నామని, తీరా ఇక్కడికి వచ్చిచూస్తే పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయన్నారు. పట్టణం ఒక బందీఖానా అయిందని, షాపులన్నీ మూసివేయడంతో తాగునీరూ దొరకలేదన్నారు.