calender_icon.png 9 February, 2026 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.కోటి బీమా.. ఆర్టీసీ డ్రైవర్ భార్యకు అందజేత

09-02-2026 12:05:42 AM

బస్ భవన్ లోయుఎస్‌ఎస్‌ఏ శాఖ

గోపాలపేట ఫిబ్రవరి 8: టీజీఎస్‌ఆర్టీసీడ్రైవర్ మృతి చెందడంతో వారి కుటుంబానికి యు ఎస్ ఎస్ ఏ బ్యాంకు శాఖ వారు రూ.1. కోటి భీమాను అందజేశారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన డ్రైవర్ దుర్గం రాఘవేంద్ర గౌడ్ (49), 09.11.2024 న జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతి చెందారు. మృతికి గల కారణాలు గంగాపూర్ (కర్ణాటక)లోని దత్తాత్రేయ స్వామి దేవాలయానికి స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సంఘటనా స్థలంలోనే ఆయన మృతి చెందారు.రాఘవేంద్ర గౌడ్ 2004 సంవత్సరం నుండి మా శాఖకు విలువైన ఖాతాదారుగా కొనసాగుతున్నారు. వనపర్తి డిపోలో సుమారు 10 సంవత్సరాలు పనిచేసిన సమయంలో మా జీత ఖాతా జీతా ప్రయోజనాల గురించి తెలుసుకుని, తన సేవింగ్స్ ఖాతాను యు ఎస్ ఎస్ ఏ ఖాతాగా మార్చుకున్నారు.

అనంతరం ఆయనను ఉప్పల్ డిపోకు బదిలీ చేశారు.ఆయన USSA ఖాతా నిర్వహిస్తున్నందున రూ.1 కోటి బీమా రక్షణకు అర్హత పొందారు. బీమా క్లెయిమ్ ప్రక్రియ పూర్తి చేసి, రూ.1 కోటి మొత్తాన్ని 27.01.2026 న నామినీ ఖాతాలో జమ చేశారు. అనంతరం, రూ.1 కోటి చెక్కును నామినీ ఆర్. శోభా రాణి హైదరాబాద్లోని బస్ భవన్లో అధికారికంగా అందజేశారు.